Header Banner

ఏపీలో మరో ఎమ్మెల్సీ ఎన్నికలపై రేపు గెజిట్ నోటిఫికేషన్! నామినేషన్లు స్వీకరించేందుకు ఆఖరి తేదీ..!

  Mon Mar 03, 2025 12:18        Politics

ఏపీలో మరో ఎమ్మెల్సీ పోరుకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే ఖాళీ అయిన రెండు గ్రాడ్యుయేట్, ఓ టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగి ఇవాళ ఓట్ల లెక్కింపు కూడా నిర్వహిస్తున్నారు. ఇవాళ రాత్రికి వీటి ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఆలోపే శాసనమండలిలో మరో ఐదుగురు ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో వారి రిటైర్మెంట్ పై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సీట్లకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి.

 

ఇది కూడా చదవండి: ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం! రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం!

 

 

ఈ నెల 29న ఏపీ శాసనమండలిలో ఐదుగురు సభ్యులు రిటైర్ అవుతున్నారు. వీరిలో జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, అశోక్‍బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడు ఉన్నారు. వీరి రిటైర్మెంట్, ఎమ్మెల్సీ సీట్ల ఖాళీపై ఇవాళ మండలి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీళ్ల రిటైర్మెంట్ ను మండలి నోటిఫై చేశాకే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో ఈ ఐదు ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమగమైంది.

 

ఇప్పటికే ఈ ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం ఇవాళ ఈ ఐదు సీట్లలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. అనంతరం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ నెల 10 వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. అనంతరం మార్చి 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత 13న నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చు. మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల చేస్తారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

 

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh#APMLC #APElections #MLCSeat #APLegislativeCouncil #APPolitics #ElectionSchedule #MLCNotification #Retirement #AndhraPradesh #ElectionResults